పాపాయిలు కొంచెం పెరిగి పెద్దయి నడిచే వరకు వాళ్ళతో చాలా కష్టం. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఇంకా మిగిలిపోయే ఉంటాయి. డాక్టర్లు చెప్పే జాగ్రత్తలు తోడు ఇంట్లో ప్రతి చిన్న విషయం లోనూ వాళ్లకు ఒక ప్రత్యేకమైన వన్నీ ఉండాలి. పిల్లలకు వాడే సబ్బులు ఎవ్వళ్ళనీ వాడనివ్వకూడదు. పిల్లలకు వ్యాధి నిరోధిక శక్తీ చాలా తక్కువ. పెద్దవాళ్లకు ఏ చిన్న సమస్య వచ్చినా అది వెంటనే పిల్లలకు వ్యాపిస్తుంది. పిల్లలకు అస్తమానం డైపర్లు వేస్తుంటారు. అది పెద్దవాళ్లకు సౌకర్యమే. కానీ అదే పనిగా వేయటం వల్ల న్యాపీ రాష్ వస్తుంది. కాబట్టి ఇంట్లో ఉన్నప్పుడు వీలైనంత వరకు వేయకపోవడం ఉత్తమం. ఒక సమయానికి కాలకృత్యాలు తీర్చుకునే అలవాటు చేస్తే పిలల్లు పెద్దవాళ్ళు ఎవ్వళ్లు ఇబ్బంది పడరు.పిల్లలను కాస్సేపైన ఎండలోకి తీసుకుపోవాలి. ఆలా వెళ్లేముందు ఎస్ సి ఎఫ్ 14 ఉన్న సన్ స్క్రీన్ లోషన్ రాయాలి . పిల్లలకు కనీసం పది నిముషాలు ఉదయపు ఎండ తగలాలి. వాళ్లకు తగినంత డి విటమిన్ అందుతుంది. ఫలితంగా ఎముకలు బలంగా పెరుగుతాయి.
Categories