ఆడపిల్లల వయసు పదేళ్ళు దాటితే చాలు రూపం విషయంలో ప్రత్యేక శ్రధ్ధ చూపెడుతూ ఉంటారు. లిప్ స్టిక్లు, నెయిల్ పాలిష్ ,మెకప్ ,హెయిర్ స్టైల్స్ అన్నీ ఇష్టమైపోతాయి. పెద్దవాళ్లు అప్పటి వరకు చేసిన అలంకారాలు నచ్చకుండా పోతాయి. ఇప్పుడే తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి పనులు మాకు నచ్చదు, కుదరవు అంటుకొపగించుకొంటే పిల్లల మనస్సులో వాటి పట్ల మనమే శ్రద్ధ పెంచినట్లు అవుతుంది. పెద్ద వాళ్ళు వద్దన్నా కొద్దీ పిల్లలకు వాటిపట్ల వ్యామోహాం ఎక్కువవుతుంది. పిల్లల వయసు రీత్యా వాళ్లలో కలుగుతున్న ఇష్టాల్ని ముందు అర్ధం చేసుకోవాలి. అందానికి ఎంత వరకు ప్రాముఖ్యం ఇవ్వచ్చో,చదువు ఎంత ముఖ్యమైనదో ,సమయాన్నీ ఎంత బాగా వాడుకోవచ్చో వాళ్ళకి నెమ్మదిగా ,వాళ్ళకి నచ్చేలా చెప్పాలి. మేకప్ వల్ల కలిగే అనార్ధాలను వాళ్ళకి తెలియ జెప్పాలి. ఆ వయసులో వాళ్ళు చదువుకు ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో చెప్పుకోవాలి.
Categories