పిల్లలు శారీరక వ్యాయామం చేయకుండా కూర్చుంటే మటుకు ఆలోచించ వలసిందే అంటున్నారు నార్త్ ఈస్ట్ విశ్వ విద్యాలయ నిపుణులు. చిన్నతనంలో చురుగ్గా వ్యయామం చేస్తూ పరుగులు తీస్తున్న వాళ్ళు పెద్దయ్యాక శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా వుంటారట. వృత్తి పరమైన విజయాలు తేలిగ్గా సాధిస్తారట. పెద్దవ్వుతూ ఉంటే వచ్చే అనారోగ్యాలు, గుండె జబ్బులు రావడం తక్కువే అంటున్నారు. చిన్నతనం లో చేసే వ్యాయామం మెదడు పెరుగుదలను ప్రభావితం చేస్తుందిట. అంచేత పిల్లలు చురుగ్గా ఆటలాడేలా చూడమంటున్నారు నిపుణులు.

Leave a comment