![ఇళ్లల్లో భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్థలు వాగ్వివాదాలు వస్తాయి. పిల్లల ముందు గట్టిగా అరుచుకుంటారు. ఇలా వాళ్ళు తరుచు గొడవ పడుతుంటే పిల్లల్లో కుంగుబాటు మానసిక ఆందోళన పెరుగుతాయంటున్నారు. ఎక్స్ పెర్ట్స్. చిన్న పిల్లలను భయానికి గురిచేసే విషయాల్లో మొదటిది తల్లి తండ్రులు ఇలా పోట్లాడుకుని విడిపోతారేమోనని చాలా టెన్షన్ పడతారట. ఎడ మొహం పెడమొహం తో పెద్దవాళ్ళంటే వాళ్లకు చదువు పైన ఏకాగ్రత వుండదంటున్నారు . కాబట్టి ఈ విషయం దృష్టిలో పెట్టుకుని పెద్దవాళ్ళు తమ కోపాన్ని వ్యక్తం చేసే మార్గాల్ని వెతకమంటున్నారు. పిల్లల్ని భయాందోళనలకు గురిచేయద్దు. మీ సమస్యలకు ఒక పేపర్ పై రాసి పరస్పరం ఇచ్చుకోండి. ఇది పిల్లల వరకు వెళ్ళదు కనుక ప్రాబ్లమ్ లేదు. లేదా ఎంత ఉద్వేగం వచ్చినా పిల్లల ముందు బయటపడకుండా వాటిని గురించి వాళ్ళు లేనప్పుడే మాట్లాడుకుని పరిష్కరించుకోండి. సమస్య పరిష్కారం కాకపోయినా వాళ్ళ ముందు మౌనంగా అయినా వుండండి. భార్య భర్తలు తల్లి తండ్రుల పాత్రలోకి వచ్చాక వాళ్లకు బాధ్యత ఉంటుంది కనుక దాన్ని గుర్తుంచుకుని ప్రవర్తించమంటున్నారు నిపుణులు .](https://vanithavani.com/wp-content/uploads/2017/03/fighting.jpg)
ఇళ్లల్లో భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్థలు వాగ్వివాదాలు వస్తాయి. పిల్లల ముందు గట్టిగా అరుచుకుంటారు. ఇలా వాళ్ళు తరుచు గొడవ పడుతుంటే పిల్లల్లో కుంగుబాటు మానసిక ఆందోళన పెరుగుతాయంటున్నారు. ఎక్స్ పెర్ట్స్. చిన్న పిల్లలను భయానికి గురిచేసే విషయాల్లో మొదటిది తల్లి తండ్రులు ఇలా పోట్లాడుకుని విడిపోతారేమోనని చాలా టెన్షన్ పడతారట. ఎడ మొహం పెడమొహం తో పెద్దవాళ్ళంటే వాళ్లకు చదువు పైన ఏకాగ్రత వుండదంటున్నారు . కాబట్టి ఈ విషయం దృష్టిలో పెట్టుకుని పెద్దవాళ్ళు తమ కోపాన్ని వ్యక్తం చేసే మార్గాల్ని వెతకమంటున్నారు. పిల్లల్ని భయాందోళనలకు గురిచేయద్దు. మీ సమస్యలకు ఒక పేపర్ పై రాసి పరస్పరం ఇచ్చుకోండి. ఇది పిల్లల వరకు వెళ్ళదు కనుక ప్రాబ్లమ్ లేదు. లేదా ఎంత ఉద్వేగం వచ్చినా పిల్లల ముందు బయటపడకుండా వాటిని గురించి వాళ్ళు లేనప్పుడే మాట్లాడుకుని పరిష్కరించుకోండి. సమస్య పరిష్కారం కాకపోయినా వాళ్ళ ముందు మౌనంగా అయినా వుండండి. భార్య భర్తలు తల్లి తండ్రుల పాత్రలోకి వచ్చాక వాళ్లకు బాధ్యత ఉంటుంది కనుక దాన్ని గుర్తుంచుకుని ప్రవర్తించమంటున్నారు నిపుణులు .