Categories
పిల్లలకు ఏం తెలియదు అనే ఉద్దేశ్యంతోనే వాళ్ళు కోరినా కోరికలను జడ్జ్ చేస్తూ ఉంటారు,ఖండిస్తారు .కానీ పిల్లలకు ఎమోషన్లు చాలా ఎక్కువ .వాళ్ళకు నో చెప్పిన ప్రతిసారి కన్నీళ్లు పెట్టుకుంటారు. కోపం ఎక్కవై పోయి తమ ఆవేదన నిస్సహాయతను చాలా ఉగ్రంగా ప్రదర్శిస్తూ ఉంటారు. ఇలాంటి ప్రతి కూల పంథాను మేనేజ్ చేసుకోగల తత్వాన్ని వాళ్ళకి అలవాటు చేయకపోతే చాలా సమస్య .దీనివల్ల ఎదిగేకొద్దీ ఏ ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేరు. వాళ్ళతో పెద్దవాళ్ళు మాట్లాడుతూ ,వాళ్ళు చెప్పేది వినిపించుకొని వాళ్ళకి పరిష్కారం చూపెట్టాలి. ముందు మాట్లాడుతోనే ఖండిస్తూ పోతే ప్రాబ్లమ్. వాళ్ళ భావోద్వేగాలు నియంత్రించుకొనేలా పెద్దవాళ్లు శిక్షణ ఇవ్వాళి.