Categories
పిల్లలకు కరోనా సోకినా పెద్ద కంగారు పడనవసరం లేదని,కోలుకునే అవకాశాలు మెరుగ్గ ఉంటాయి సరైన సపోర్టివ్ కేర్ తీసుకొంటే ఆరోగ్యంగా బయట పడతారని చెపుతున్నారు అధ్యయన కారులు. కరోనా సోకిన పిల్లల్లో లక్షణాలు అంతగా బయటపడవనీ. సరైన సమయంలో ఇన్ ఫెక్షన్ ను గుర్తించి సపోర్టివ్ చికిత్స అందిస్తే ఒకటి రెండు వారాల్లో కొలుకుంటారని పరిశోధకులు చెపుతున్నారు. చైనా,సింగపూర్ లలో వేల మంది కరోనా సోకిన పిల్లల పైన చేసిన అధ్యయనంలో కోవిడ్-19 సోకిన పిల్లల్లో ఎక్కువ మందిలో లక్షణాలు ఏవీ బయట పడలేదని కేవలం పొడి దగ్గు నీరసం జ్వరం వెంటనే కనిపించాయన్నారు. 9ఏళ్ల లోపు పిల్లలు ఎంతో మంది కరోనా తో ఆస్పత్రి పాలైన ఒక్క మరణం కూడా నమోదు కాలేదన్నారు.