కళల్లో ప్రావీణ్యత ఉన్న వాళ్ళకి సమాజానికి ఏదో చేయాలన్న తాపత్రయం కూడా ఉంటుందని పరిశోధకులు చెపుతున్నారు. అలాగే కళలను ఇష్టపడేవాళ్లకి ,కళలను ప్రేమించే వారికి సామాజిక కార్యకలాపాల పట్ల సానుకూల దృక్పథం, సహనం ఉంటాయి. రక్తదానం ,డబ్బు విరాళంగా ఇవ్వటం ,పొరుగువారికి సహాకరించటం ,తెలియని వారికి దారి గుర్తులు వివరంగా విసుగులేకుండా చెప్పటం. అదనంగా పొరపాటు గా తమ చేతికి ఏ క్యాషియరో ఇచ్చిన డబ్బు తిరిగి ఇచ్చి వేయటం ఇతరుల సొమ్ముకు ఆశపడకుండా ఉండటం వంటి ఎన్నో మంచి గుణాలు వీరి చర్యల్లో విళితమై ఉంటాయి. కాస్త వయసు మళ్ళిన వారిలో కంటే యువతరంలో ఈ సామాజిక బాధ్యత ఎక్కువగా కనిపించినట్లు అధ్యయనకారులు చెపుతున్నారు.