Categories
యాంటీ బ్యాక్తీరియల్ గుణాలు అధికంగా ఉన్న మునగ ఆకు,పూవులు ఈ సీజన్ లో పుష్కలంగా దొరుకుతాయి. కాల్షియం,ఐరన్ లతో పాటు ఆరోగ్యకరమైన ప్రోటీన్ లు ఇతరత్రా విలువైన ఖనిజాలు పోషకాలు ఉన్న మునగాకును విరివిగా ఆహారంలో వాడుకోమంటున్నారు ఎక్సపర్ట్స్. సరిగ్గా చెప్పాలంటే మునగ రోగనిరోధక శక్తి నిచ్చే అత్యంత విలువైన ఆకు. శ్వాసకోశ ఇబ్బందులు ఉన్న వాళ్ళకి ఇది చక్కని ఔషధం. శరీరంలో వ్యర్ధాలను శక్తి వంతంగా బయటికి పంపగలదు.ఫ్లూ తో బాధపడుతూ ఉంటే మునగాకు ఎండబెట్టి నిలువ చేసుకొన్నా మంచిదే. పప్పుగా కారంపొడిగా,సుప్ గా,చపాతి పిండిలో కలిపి అలా ఏవిధంగా అయినా మునగాకు తీసుకోవచ్చు.