ఎంత జాగ్రత్తగా ఉన్నా క్రీములతో ఇబ్బంది తప్పదు. వంట ఇంట్లో చేతులు శుబ్రంగా కడుక్కుని చేతులు హ్యాండ్ టవల్ కు తుడుచుకుంటే దానిలోని క్రిములు చేతుల్లోకి చేరిపోతాయి.  ఈ ఇబ్బంది పోవాలంటే ప్రతి రెండు రోజులకు ఒక సారి వాష్ చేయాలి. కిచెన్ లో, బాత్ రూమ్ లో వుండే టవల్స్ అత్యధిక బాక్టీరియాకు మూలం ముఖ్యంగా కిచెన్ టవల్స్ లో హానికరమైన కోలీఫార్మ్ బాక్టీరియా వుంటుంది. వీటిలో తడి ఎక్కువగా వుంటుంది కాబట్టి బాక్టీరియాకు బ్రీజింగ్ గ్రవుండ్ అవ్వుతాయి. వంట గదిలో ప్లాట్ ఫామ్ తుడవడం, ఒలిగిన పదార్ధాలు క్లీన్ చేయడం జరుగుతుంది కాబట్టి  త్వరగా కాలుష్యానికి గురవ్వుతాయి కానీ ఇవి వాష్ చేసేందుకు వేడి నీరు వాడాలి. రెండు రోజలకు ఒక సారి శుబ్రంగా ఉతికి ఎండలో ఆరేయాలి.

Leave a comment