ఈ వీడియోని యూ ట్యూబ్ లో వేలమంది చూస్తున్నారు. రాజస్థాన్ భరత్ పూర్ కు చెందిన వాణీశర్మ డిగ్రీ పూర్తీ చేసింది. డిఫెన్స్ లో చేరాలని ఫిట్ నెస్ కోసం ఇంటిదగ్గర మైదానంలో జాగింగ్ చేస్తోంది. ఒక 18 ఏళ్ళ కుర్రాడు ఆమెను వేధించటం మొదలు పెట్టాడు . స్నేహితులతో వచ్చి మరీ విసిగించాడు. ఇద్దరం ప్రేమించుకొన్నమని పెళ్ళాడబోతున్నమని ప్రచారం మొదలు పెట్టాడు. చూసి చూసి ఓ రోజు ఓ దుడ్డుకర్ర తెచ్చి బాధడం మొదలు పెట్టింది. అలా కొట్టే వీడియో వైరల్ అయింది. పోలీసులు ఆ అబ్బాయిని అదుపులోకి తీసుకొన్నారు.

Leave a comment