ఇంటి పనులు, ఉద్యోగ బాధ్యతల్లో, వ్యాయామాలు, యోగాలు, స్పా ట్రాట్మెంట్స్ వంటివి సాధారణంగా ఆడవాళ్ళ త్యాగం చేస్తారు. అయితే నిర్ణయం బలంగా వుంటే కనీసం, వారానికి రెండురోజులైనా సౌందరం పట్ల కాస్త శ్రద్ధ తీసుకోవచ్చు. వారనికి ఒక్కరోజు సిరోజాల సంరక్షణకు టైమ్ కేటాయించాలి. ఒక బౌల్ లో అరటి పండు, అవకాడో చిదిమేసి అందులో ఆలివ్ ఆయిల్, వెనీలా ఎస్సెంషియల్, లావెండర్ కలిపి జుట్టుకు పట్టించి 10 నుంచి 15 నిముషాల తర్వాత తలస్నానం చేయొచ్చు. గోరువెచ్చని నీరు క్లెన్సర్ తో ముఖం శుబ్రంగా కడుక్కుని రెండు నిమిషాలు ఏదైనా ఫేషియల్ క్రీమ్ మొహం పైన మసాజ్ చేయాలి. శుబ్రమైన వస్త్రాన్ని వేడి నీటిలో ముంచి ముఖం పైన రెండు సార్లు ప్రెస్ చేస్తే మురికి పోయి రంధ్రాలు తెరుచుకుంటాయి. నాణ్యమైన మాయిశ్చురైజర్ రాస్తే ముఖం బావుంటుంది. అరకప్పు పాలల్లో బాదాం నూనె గ్లిజరిన్ కలిపి ఆ మిశ్రమం తో చేతులు, పాదాలు ఐదు నిమిషాల పాటు రుబ్ చేసి నీళ్ళతో కడిగేస్తే చర్మం మృదువుగా చక్కని తేమతో టీ త్రీ ఆయిల్ వేసి పాదాలు అందులో వుంచి స్క్రాపర్ తో రుద్దితే మృతకణాలు పోతాయి. వారంలో రెండు మూడు పుటలు ఈ పనుల కోసం కేటాయిస్తే చాలు.
Categories