మనం కొనే వస్తువుల్లో మనకి ఎంతగానో ఉపయోగపడే వస్తువుల లిస్ట్ రాస్తే మొదట ఫ్రిజ్ పేరు రాయాలి. ఇంత బాగా ఉపయోగపడే ఫ్రిజ్ ను కనీసం నెలకోసారి క్లీన్ చేయమంటారు నిపుణులు. ఫ్రిజ్ లో వుండే కెచెప్ సీసా మూతలు జామ్ బార్ మూతల పై మైక్రోబ్స్ యథేచ్ఛగా తిరుగుతాయి. ఎదో ఒకటి బతికిన ఆనవాళ్లు తప్పకుండా ఉంటాయి. ఇటువంటి వాటని వారంలో ఒక్కసారైనా సబ్బు నీళ్లతో తుడుస్తూ ఉండాలి. ఇది వీకెండ్ పనుల జాబితా లో లేకపోయినప్పటికీ తప్పనిపని. ఫ్రిజ్ లో కొన్ని రోజులే పదార్ధాలు నిలువ చేయాలి. ఫయిజ్ కిక్కిరిసిపోతే కోల్డ్ ఎయిర్ సమంగా సిర్క్యులేట్ అయ్యే అవకాశం వుండదు. దీనివల్ల పదార్ధాలు చల్లగా ఫ్రెష్ గా వుండవు. బయట తుడిచేసి శుభ్రంగా ఉందనుకుంటాం అసలు క్లీన్ చేయవలిసింది లోపలే. గ్రిల్ మోటార్ వద్ద వ్యాక్యూమ్ చేయాలి. అక్కడ దుమ్ము పేరుకుపోకుండా చూసుకోవాలి. ఎన్నో పదార్ధాలు ఫ్రెష్ గా తినేందుకు భద్ర పరుచుకునే ఫ్రిజ్ ని అన్నింటికంటే జాగ్రత్తగా క్లీన్ చేస్తూ కాపాడుకోవాలి.
Categories