Categories
ఒకే సారి ఎన్నోపనులు చేయగల సామార్ధ్యం గలవారిగా స్త్రీలకో గుర్తింపు ఉంది. కానీ ఇదే నైపుణ్యం వారి ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుందని చెపుతున్నాయి అధ్యయనాలు. పెరిగిన బాధ్యతలు ఒత్తిడిని పెంచుతున్నాయి.తగినంత విశ్రాంతి కరువు ,పని గంటలు అధికం. ఇంట్లో అందరి అవరాలు సరిగా చూడటం లేదన్న ఫిర్యాదు . సమయం లేక ఒత్తిడితో ఉదయపు పలహారం చేయకపోటవటం ,మధ్యాహ్నం భోజనం చాలా పరిమితంగా ఉండటం ఎముకలపై ప్రభావం చూపెడుతున్నాయి. ఒత్తిడిలో శరీరం కార్టిసోల్ హార్మోన్ అధికమై ఇదే ఎముకలను దెబ్బతీస్తోంది. వ్యాయామం లేకపోవటం ,ఏదో ఒక జంక్ ఫుడ్ తినటంతో భారీ కాయం బరువు మోకాళ్ళు మోయలేకపోవటం కీళ్ళ నోప్పులు .ఈ జీవన విధానం స్త్రీల అనారోగ్యం తెచ్చిపెడుతుందని అధ్యయనాలు చెపుతున్నాయి.