నేల పైన కాకుండా నది పైన తేలియాడే ఉద్యానవనం చూడాలి అనుకుంటే న్యూయార్క్ లోని లిటిల్ ఐలాండ్ పార్కుకు వెళ్లాలి. ఒక హెక్టర్ విస్తీర్ణంలో తులిప్ పూల ఆకారం వచ్చేలా నిర్మించారు. ఈ పార్కు నిర్మాణానికి మూడేళ్ళు పట్టింది. వ్యాపారవేత్త, నిర్మాత బారీ డిల్లర్‌, అతని భార్య డయాన్‌ లు కలిసి రెండు వేల కోట్ల రూపాయలతో ఈ పార్క్ నిర్మించారు రకరకాల పూల చెట్లు విశ్రాంతి తీసుకునే పచ్చిక మైదానాలు ఉండే ఈ పార్క్ లోకి వెళితే చుట్టూ వుండే మన్‌హాటన్‌, న్యూజెర్సీ ప్రాంతాలను కూడా హాయిగా చూడచ్చు. ఇక్కడికి ప్రవేశం ఉచితమే.

Leave a comment