ఈ టాక్సీ గాలిలో ఏకబిగిన రెండు వందల కిలోమీటర్లు, గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తుంది. పైలెట్, ఓ ప్రయాణికుడు కూర్చునేందుకు రెండు సీట్లు ఉంటాయి. విద్యుచ్ఛక్తితోనే నడుస్తుంది ధర టాక్సీ కంటే ఎక్కువ హెలీకాప్టర్ కంటే తక్కువ. 2023లో దాన్ని నడిపిస్తాం అంటోంది శ్రేయా రస్తోగి. ఏరోస్పేస్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన శ్రేయ టాక్సీ అభివృద్ధి దిశగా పనిచేస్తుంది. ఇంటి పైన నిలిపేందుకు వీలుగా ఈ టాక్సీ డిజైన్ చేశారు. ఈ ఫ్లైయింగ్‌ ట్యాక్సీని శ్రేయా సహ వ్యవస్థాపకురాలిగా ఉన్న ‘ఈ-ప్లేన్‌’ సంస్థ ఐఐటీ మద్రాస్‌ క్యాంపస్‌లో అభివృద్ధి చేస్తోంది.

Leave a comment