ప్రాంతాలు తయారు చేసే పద్ధతులు వేరైనా టీ అందరి ఫేవరెట్ . సాధారణంగా టీ అంటే టీ పొడి,పాలు చెక్కర తో చేసే గోధుమ రంగు ద్రవం . కానీ ఈ టీ ఒక్కోదేశంలో ఒక్కో రుచి తో తయారు చేస్తారు . టిబెట్ టీ లో వెన్నా, ఉప్పు వేస్తారు . “పారో ఛా” అంటారు . థాయ్ లాండ్ వాళ్ళు టీ లో పాలపొడి చక్కెర పాలు ఐస్ గడ్డలు వేసి పొడవైన గ్లాసులో చల్లగా ఇస్తారు . దాన్ని ఛా యోన్ అంటారు . స్విట్జర్లాండ్ లో టీ లో చక్కర, నిమ్మరసం, పుదీనా తో పాటు అక్కడి స్థానిక మూలికలు కలుపుతారు . ఆఫ్రికా దేశాల్లో చాయ్ లో నీళ్ళు తక్కువ పంచదార ఎక్కువ . జర్మనీలో సంప్రదాయ టీ ఖాళీ కప్పు లో చక్కెర వేసి టి నీళ్ళు పోస్తారు ,క్రీమ్ వేస్తారు వెన్న కూడా . ఈ టీ స్పూన్ తో కలప కుండా తాగుతూ ఉంటే ముందుగా క్రీమ్ వెన్న తర్వాత చేదు రుచితో టీ ఆపైన నాలక్కి తియ్యని చక్కెర రుచి తగులుతుంది . ఈ టీ చాల ఫేమస్ కూడా .
Categories