ఒక్కో ప్రాంతంలో ఒక్కో ఫ్యాషన్ కొన్ని సంప్రదాయాలు కూడా ఫ్యాషన్ కిందకు తేవచ్చు అని నిరుపించారు కెన్యాలోని యురిబా గిరిజన మహిళ తెగలు. వీళ్ళు తలపాగతోనే మెరిపిస్తారు. ఈ తల పాగ ఎత్తుని బట్టి వాళ్ళ వయస్సు చెప్పవచ్చు. ఇది ఆరు గజాల చీర పోడవు కంటే పెద్దది. ఆరువందల సంవత్సరాల నుంచి ఈ తల పాగ చుట్టడం సంప్రదాయంగా వస్తుంది. ఈ తల పాగ కోసం వర్ణ రంజితమైన వస్త్రాన్ని డోక్ అంటారు. అందరికన్నా అందంగా కనిపించేందుకు పెట్టుకునే ఈ తల పాగ ను గిలే అంటారు. ఇవాల్టి రోజుల్లో ఇంత పెద్ద వస్త్రంతో తల పాగ ధరించకపోయిన సంప్రదాయం కోనసాగుతునే ఉంది. వయస్సులో పెద్దవాళ్ళు ఈ తల పగాతో ఎంతో అందంగా తిర్చి దిద్దగలరు. అయిన ఇక్కడ అబ్బాయిలు ఈ తలపాగా కు వాడిన వస్త్రం ,రంగు సృజనాత్మకతను బట్టి అమ్మాయిల మనసును అంచనా వేస్తారు అంటా . అమ్మాయిలు ఈ గిలే ను పుసలు,పూలతో అలంకరించి మరింత సోకుగా ఫ్యాషన్ గా కనిపించేలా ప్రయత్నిస్తారంట.
Categories