ఇప్పుడంటే పెద్ద తీరిక ఉండటం లేదు కానీ ఇదివరలో చిన్న చిన్న బొమ్మరిళ్ళలో పిల్లలు గుజ్జన గూళ్ళు వండుకొని ఆటలాడుకోనే వాళ్ళు. పిల్లల కోసం బుల్లి మంచాలు, బీరువాలు ,లక్కపిడతలు, తాటాకు బొమ్మలు దొరికేవి .ఇదే రూపం మార్చుకొని ఖరీదైన మినీయేచర్డాల్, డ్రాయింగ్ అలంకరణలో భాగం అవుతున్నాయి. చిన్న ల్యాప్ టాప్ వెడల్పులో ఈ బుల్లి ఇంట్లో మంచాలు ,సోఫాలు,కుర్చీలు.లైట్లు, బుల్లి బుల్లి వస్తువులు,అందమైన డ్రాయింగ్ బెడ్ రూములు పెయింటింగ్ వీలైతే ఒకటి రెండు అంతస్థులున్న అన్ని ఉన్నాయి. గోడకి పెయింటింగ్ లాగా అమర్చుకోవాలంటే పలుచని పెట్టెలోపల బొమ్మలరిళ్ళను రూపొందిస్తున్నారు. ఈ సారి పిల్లల పుట్టిన రోజుకు లేదా ఫ్రెండ్ గృహాప్రవేశానికో ఈ మినీయేచర్ ఇళ్ళను గుర్తు చేసుకోవచ్చు.

Leave a comment