Categories

1933లో గుంటూరు జిల్లా చేబ్రోలులో జన్మించారు వాసిరెడ్డి సీతాదేవి. నాగపూర్ విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఏ చేశారు. 39 నవలలు 100 కి పైగా కథలు రాశారు. ఈమె రాసిన మట్టి మనిషి 14 భాషలలోకి అనువాదం చేశారు. ఈమె నవలలు దూరదర్శన్ లో సీరియల్ గా, సినిమాలుగా వచ్చాయి. జవహర్ బాలభవన్ డైరక్టర్ గా పని చేశారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం 5 సార్లు అందుకున్నారు. ఈమెను ఆంధ్రపెర్ల్బక్ తో పోలుస్తారు.