చిన్న పాటి కిటుకుల తో ఇల్లు, వస్తువులు శుభ్రం చేసుకోవచ్చు. ఏదైనా ఫ్లోర్ క్లీనర్ మైక్రోవేవ్ లో స్ప్రే చేసి అరగంట పాటు వదిలేసి తర్వాత టూత్ బ్రష్, పొడి బట్టతో తుడిస్తే మైక్రోవేవ్ ఎటువంటి మరకలు లేకుండా ఉంటుంది. టమాటో ల పైన రెండు గాట్లు పెట్టి వేడినీళ్లలో కాసేపు పడేస్తే పై తొక్క తెల్లగా ఊడి వస్తుంది. వారానికి ఒకసారి బేకింగ్ సోడా నిమ్మరసం కలిపిన మిశ్రమం లో వేడి నీళ్ళు పోసి టూత్ బ్రష్ ను నానబెట్టాలి తర్వాత మామూలు నీళ్ళతో కడిగేస్తే చాలు బ్రష్ లు శుభ్రంగా ఉంటాయి.

Leave a comment