కంటికి నచ్చిన ప్రతి వస్తువు కొని ఇల్లంతా నింపేస్తే ముందు ఇల్లు శుభ్రం చేసుకోవటం, సౌకర్యంగా జీవించడం కష్టమైపోతుంది అంటున్నారు ఎక్సపర్ట్స్ . అవసరమైన వస్తువుల కే ఇంట్లో చోటిస్తే ఇల్లు విశాలంగా కంఫర్ట్ గా ఉంటుంది. వర్షాకాలంలో దుస్తులు ఆరేసేందుకు లోహపు స్టాండ్ లు కొంటూ ఉంటాం కానీ అది నడిచేందుకు అడ్డుగా ఉంటుంది. కిటికీకి అమర్చే వేలాడదీసే పరికరం తో బట్టలు ఆరేసే చోటు కలిసి వస్తుంది. లాప్ టాప్ కోసం రైటింగ్ టేబుల్ హాల్ మొత్తం ఆక్రమించే సోఫా సెట్లు అలంకరణ కోసం కార్నర్ టేబుల్స్ ఇవన్నీ ఇల్లంతా ఆక్రమించి చేస్తాయి. ఎన్నో సొరుగులు ఉండేవి, గోడ లోకి ఫిక్స్ చేసేవి ఆధునికమైన వస్తువులు ఉన్నాయి. కబోర్డ్స్ బీరువాలు గోడ లోకి ఫిక్స్ చేసేవి ఆధునికమైన వస్తువులు అన్నీ చక్కగా అమర్చుకుని ఇల్లంతా విశాలంగా ఉంచుకోవచ్చు.
Categories