పురాతన కాలం నుంచి వాడుకలో ఉన్న చందనం లో ఔషధ గుణాలు ఎక్కువగా ఉన్నాయి. మొటిమలు తగ్గించడం ఎండ వల్ల ఏర్పడిన నలుపును తగ్గించడం శరీర ఛాయా మెరుగుపరచడంలో గంధం బాగా పనిచేస్తుంది. టీ స్పూన్ గంధం పొడి లో టీ స్పూన్ పచ్చి పాలు, టీ స్పూన్ తేనె, టీ స్పూన్ నిమ్మరసం, టీ స్పూన్ టమాటో రసం వేసి కలిపి ఐదు నిమిషాలు నానబెట్టాలి. ఈ మిశ్రమాన్ని రాత్రి పడుకునే ముందు ముఖానికి అప్లయ్ చేసి ముఖం పైన రోజ్ వాటర్ చల్లి కింది నుంచి పైకి గుండ్రంగా మర్దన చేసి నీటితో కడిగేయాలి శుభ్రంగా కడిగిన తర్వాత మాయిశ్చరైజర్ రాసుకోవాలి రెగ్యులర్ గా ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల ముఖ చర్మం యవ్వన వంతంగా చేస్తుంది.

Leave a comment