మనం తీసుకునే ఆహారం ద్వారా అందే పిండిపదార్థాలు గ్లూకోజ్ గా మారడం వల్లే బరువు పెరుగుతుంది. కనుక సంక్లిష్ట పిండి పదార్థాలు ఉన్న ఆహారం ఎంచుకోవాలి సాధారణ బియ్యానికి బదులు ముతక బియ్యం, రాగులు, కొర్రలు, జొన్నలు వంటి వాటికి ప్రాధాన్యం ఇవ్వాలి వాటికి జతగా కూరగాయలు, ఆకుకూరలు ఎంచుకుంటే పోషకాలు అందుతాయి. శరీర జీవక్రియ రేటు మెరుగుపడుతుంది. శరీరానికి తగినంత శక్తి అందితే ఆకలి నియంత్రణలో ఉంటుంది. అందుకే ఉదయంవేళ అల్పాహారం తీసుకోవాలి .అందులో మాంసకృత్తులు, పీచు, కార్బోహైడ్రేట్లు ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల సహజంగా మధ్యాహ్నం భోజనం తక్కువ తీసుకుంటారు. గుడ్లు, పప్పుధాన్యాలు, అవిసెగింజలు, చేపలు వంటి వాటితో పాటు కూరగాయలు ఆకుకూరలు నిత్యం తీసుకునే ఆహారంలో భాగంగా ఉండాలి.

Leave a comment