గట్టిగా షాంపూ చేసుకుంటే జుట్టు పరిశుభ్రంగా ఉండదు, కానీ ప్రత్యేక చర్యలు చేపడితేనే జుట్టు ఆరోగ్యంగా అందంగా ఉంటుంది అంటున్నారు శిరోజాల నిపుణులు. గుడ్డులోని పచ్చసొనను కొద్దిగా కొబ్బరి పాలు విటమిన్ ఇ కలిపి తలంతా రాసి గంటసేపు ఉంచుకొని ఆ తర్వాత తలస్నానం చేస్తే తలలోని చుండ్రు పోతుంది. శెనగపిండిలో తెనె కలిపి ఆ మిశ్రమాన్ని తలకు పట్టించి అరగంట ఆగి తలస్నానం చేస్తే జుట్టు పట్టులా మెరుస్తుంది. అరటిపండు గుజ్జులో ఆలివ్ ఆయిల్ లేదా కొబ్బరి నూనెను కలిపి రాసి అరగంట తర్వాత తలస్నానం చేస్తే చిట్లిన వెంట్రుకలు యధాస్థితికి వస్తాయి. జుట్టు రాలడం తగ్గి పెరుగుతుంది.

Leave a comment