నీహారికా,

ఎప్పుడైనా మనస్సు బావుండక పొతే గుళ్ళకి వెళతామని పెద్దవాళ్ళు చెప్పుతుంటారు. గూళ్ళో ప్రశాంతత ఎక్కడ నుంచి వస్తుంది, ఇప్పుడు దానికి కారణం చెప్పుతున్నారు ఎక్స్ పర్ట్స్. గుడిలో వుండే పచ్చని వాతారణం , పూల చెట్లు , శుబ్రంగా వుండే వాతావరణం  మంచి గంధం, పూల వాసనలు ఇవే మంచి సువాసనలే మనస్సుకి సేద దీర్చేవి అంటున్నారు పరిశోధకులు. అద్యాత్మిక వాతావరణంలో భాగమైన పువ్వులు ఇతర సుగంధ ద్రవ్యాలు, ఆ సువాసనలు పీల్చిటే మనస్సులో ఆదుర్ధా, అలజడి క్రమంగా బయటకు పోతాయి. అలాగే ఈ వాతావరణం  ఇంట్లో సృష్టించుకోమంటారు. చక్కని పువ్వుల కుండీలు అమర్చడం, అగర్ బత్తీలు వెలిగించడం తో  ఇంట్లో ఘర్షణ వాతావరణం తగ్గుతుంది. మనస్సు ప్రశాంతంగా వుంటుంది. అలాగే వత్తిడి వదిలించుకోవడం కోసం గోరు వెచ్చని నీటి తో తలస్నానం , మంచి సంగీతం వినడం, సాంప్రదాయకంగా వెచ్చని పాలలో తేనె కలిపి తాగడం చేస్తే వత్తిడి తగ్గుతుంది. చక్కని నిద్ర కుడా పడుతుంది.

Leave a comment