Categories
వయస్సు మీరే కోద్దీ ఆలోచనా శక్తి, జ్ఞాపక శక్తి తగ్గుతూ ఉంటాయి. అయితే 65 దాటిన తర్వాత ప్రతి రోజు క్రమం తప్పకుండా వారానికి మూడు రోజుల పాటు 45 నిమిషాల సేపు వ్యాయామం చేస్తే ఆలోచన శక్తి మళ్ళీ పెరుగుతుందని నిరూపించారు కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ నిపుణులు. 160 మంది వృద్దులను ఎంపిక చేసి వారితో నడక ,జాగింగ్ ,సైక్లింగ్ వంటి వ్యాయామాలు ,పీచు ఎక్కువగా సోడియం తక్కువగా ఉండే పండ్లు కూరగాయలు నట్స్ వంటి ఆహారం ఇచ్చారు. ఆరు నెలల పాటు క్రమం తప్పకుండా ఇలా చేయంచారు వారిలో బిపి ,మధుమేహాం వంటివి తగ్గిపోయి వయసు మరో తొమ్మిదేళ్ళు వెనక్కి వచ్చిందట. ఆలోచనా శక్తి పెరిగింది. అంటే అరవైలు దాటాకా వ్యాయామం ,చక్కని ఆహారం తీసుకొంటే వయస్సు తరుగుతుందన్న మాట.