Categories

53 ఏళ్ల వయసులో మహారాష్ట్రకు చెందిన కల్పనా జంభలే పదో తరగతి ఫస్ట్ క్లాస్ లో పాసై ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు చిన్న వయసులో కుటుంబ పరిస్థితుల మూలంగా చదువు లేకపోయినా కల్పనా మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త స్కీమ్ తో ఉత్సాహం తెచ్చుకుంది. పదో తరగతి పూర్తి చేయని వాళ్ళు ఆన్ లైన్ క్లాసుల్లో శిక్షణ తీసుకుని పరీక్ష రాయవచ్చు. స్టడీ మెటీరియల్ ప్రభుత్వం ఇస్తుంది. ఈ స్కీమ్ ప్రకటన రాగానే ఎక్కడలేని ఆనందం ఎంతో కష్టపడి చదివి పదవ తరగతిలో 79.60 శాతం మార్కులతో పాస్ అయింది కల్పనా జంభలే. కల్పన కొడుకు ప్రసాద్ జంభలే సాఫ్ట్ వేర్ ఇంజనీర్.