వయసు అయిపోయింది ఇంకేం చేస్తాం అనుకోవద్దు వయసు ఏదైనా సరే ఏదో ఒకటి సాధించాలన్న కలలు కనాలి. ఈ ప్రపంచంలో దేనికి ఇంతవరకే అన్న పరిమితి లేదు అంటుంది 67 ఏళ్ల డాక్టర్ గీత ప్రకాష్. డిల్లీకి చెందిన గీతా ప్రకాష్ 30 ఏళ్ల పాటు డాక్టర్ గా పని చేసి తర్వాత మోడలింగ్ లోకి అడుగుపెట్టి ఎంతో మందికి ప్రేరణ గా నిలిచారు. ప్రముఖ డిజైనర్ బ్రాండ్స్ అంజు మోడీ, తరుణ్ తహిలియాని, గౌరవ్ గుప్తా, తోరానీ, నికోబార్, జైపూర్ మరియు అష్దీన్ జేపోర్ వద్ద మోడల్ గా రాణిస్తోంది. ఇటలీకి చెందిన ఒక పేషెంట్ ట్రీట్మెంట్ తర్వాత ఆమెను మోడలింగ్ లోకి ఆహ్వానించాడు అతను తీసిన ఫోటోలు ప్రముఖ డిజైనర్ తరుణ్ తహిలియానికి నచ్చడంతో ఆయన రూపొందించిన ‘కనీ’ శాలువా మోడల్ గా గీత ఎంపికయింది. 57 ఏళ్ల వయసులో అలా మోడలింగ్ లోకి ఆమె ప్రయాణం మొదలైంది.
Categories