వయసు పెరుగుతుంటే నుదురు కంటి దగ్గర ముడతలు, మొహం రంగు తగ్గటం అన్నీ సహజమే కాస్త శ్రద్ధ తీసుకుంటే ముఖ చర్మం బిగుతుగా అవుతుంది. ముందుగా సబ్బు బదులుగా మైల్డ్ క్లెన్సర్ కి మారాలి. పొడి చర్మం అయితే క్రీమ్ ఆధారిత, జిడ్డు చర్మం అయితే నీటి ఆధారిత మాయిశ్చరైజర్ ఎంచుకోవాలి. ఎండలోకి వెళ్లే సమయంలో సన్ స్క్రీన్ కనీసం 30 (ఎస్.పి.ఎఫ్) ఉన్నది ప్రతి రెండు గంటలకోసారి రాసుకోవాలి. స్పూన్ ఆలివ్ నూనె కొన్ని చుక్కల గ్లిజరిన్ కలిపి ముఖానికి మర్దన చేయాలి. పదిహేను నిమిషాల తరువాత మొహం కడిగేసుకోవాలి. అలోవెరా గుజ్జు విటమిన్ కలిపి రాయాలి. బాదం పప్పు నానబెట్టి పాలలో కలిపి గుజ్జుగా చేసి మొహానికి అప్లై చేసి ఆరేవరకు ఉంచుకోవాలి. వీటిలో ఏదో ఒకటి ప్రతిరోజూ ప్రతి ప్రయత్నించవచ్చు. ముఖం కడిగేసుకోన్నాక మాయిశ్చరైజర్ రాయాలి.
Categories