నీహారికా,
పిల్లల పరీక్షలు మెదలవుబోతున్నాయి.పరీక్షలు రాసే పిల్లల ఇళ్లలో టెన్షన్ టెన్షన్.చదివి అలసిన పిల్లలకు కావలసింది తల్లిదండ్రులు పుష్కలమైన ప్రోత్సాహం,వాత్సల్యం.సరిగా చదవడం లేదని ,ఆలస్యంగా లేచారని ,శ్రద్ద తగ్గిందని ఇలా అయితే రేపు పరిక్షల్లో సున్నా చుడతారని వ్యాఖ్యానాలు చేయకూడదు.పిల్లలలో వత్తిడి మొదలయ్యే విదంగా మాట్లాడకూడదు.ఎప్పుడూ అనుకూలంగా పిల్లలకు ధైర్యం ఇచ్చే విదంగా ప్రోత్సహించాలి.అమ్మ నాన్న లు తన కష్టం గమనించారని .తనకు అండగ ఉన్నారన్న ధైర్యం వాత్సల్యం వారిలో స్థిరత్వాని పెంచుతాయి . వారిలో ఆలోచనల్లో అనుకులతను కలిగిస్తాయి.పరీక్షల తాలూకు వత్తిడిని పిల్లలు సమర్థవంతంగా ఎదుర్కొనేవిదంగా పెద్దవాళ్ళు సహకరించాలి.మంచి సమతుల్యాహారం అందిస్తూ వారు పూర్తి ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలి.