వేసవిలో వచ్చే అన్ని రకాల పండ్లు లేపనాలు గా చేసేయచ్చు. ఇవి మొహానికి మెరుపును అందిస్తాయి మచ్చలు పొగడతాయి  అంటున్నారు ఎక్సపర్ట్స్. పుచ్చకాయ ముక్కలు గుజ్జుగా చేసి అందులో పెరుగు కలిపి ఆ మిశ్రమాన్ని లేపనం లాగా మొహానికి పూసి ఓ అరగంట అయ్యాక కడిగేస్తే చాలు. ఇది మాయిశ్చరైజర్ గా పనిచేసి చర్మం లోని మృతకణాలు పోగొడుతుంది అంటున్నారు. అలాగే పుచ్చకాయ తేనె కలిపి మాస్క్ వేస్తే ఇది సహజ టోనర్ గా పనిచేసి ముఖచర్మం క్లెన్సింగ్ అయి మృదువుగా మారిపోతుంది. అరటిపండు పుచ్చకాయ గుజ్జు రసంలో యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు చర్మాన్ని ఆరోగ్యవంతం చేస్తాయి. ఈ లేపనం తో మొహం పై మచ్చలు పోతాయి. చర్మం మృదువుగా మారి పోతుంది.

Leave a comment