లోక్ సభ సభ్యురాలు సుస్మితాదేవ్ అంతర్జాలంలో ఒక నినాదం పోస్ట్ చేశారు. వస్తు సేవల పన్ను తుసుకు రాబోతున్న కేంద్ర ప్రభుత్వం సానిటరీ నాప్కిన్స్ పై పన్ను పూర్తిగా తొలగించాలి. ఇదే నినాదం అసోం లోని నిల్చార్ స్థానం నుంచి ప్రతి నిధ్యం వహిస్తున్నారామె. మన దేశంలో గర్భనిరోధక సాధనాలకు ఏ పన్ను లేదు. ఆరోగ్య పరంగా అంటే ప్రాధాన్యం వున్న సానిటరీ నాప్ కీన్స్ పై పన్ను వేయడం అన్యాయం. ఏడాది లో పన్నెండు నెలలు, అలా యించు మించు 39 ఏళ్ళు తమ ప్రేమేయంలేని ఒక విషయం కోసం స్త్రీల నుంచి పన్ను వసూలు వద్దు. జీ.ఎస్.టి నేపధ్యం లో దీన్ని ఆపాలి. ఇప్పటికి మన దేశంలో యుక్త వయస్సులోని 35 కోట్ల మంది స్త్రీలలో 12 శాతం మాత్రమే వీటిని వినియోగిస్తున్నారు. ఇక గ్రామాల్లో అయితే రెండు శాతమే. జిఎస్టి లో దాని పై పన్నెండు శాతం పన్ను వేసే అవకాసం వుంది అంటున్నారు. వ్యాట్ తో కలిపి ఇది 14 శాతానికి పెరగొచ్చు. ఈ పన్ను పూర్తిగా తొలగించండి అంటున్నారామె. బాత్రూమ్ లో నీళ్ళు, ఏ సౌకర్యాలు లేని చొట ఎంతో మంది యుక్త వయస్సు అమ్మాయిలు జీవిస్తున్నారు, పనులు చేసుకుంటున్నారు, చదువుకుంటున్నారు. అస్సలు ఈ నాప్కిన్స్ ఉచితంగా ఇస్తే బాగుంటుంది.
Categories