Categories
ఏ చలి రోజుల్లో దుప్పట్లు దిండ్లు పరుపులు ఎప్పటికపుడు క్లిన్ చేయండి లేకపోతే డస్ట్ మైట్స్ పేరుకొని అనారోగ్యాలు వస్తాయి అంటున్నారు. ముందుగ నిత్యం ఉపయోగించే దుప్పట్ల విషయానికివస్తే అవి మాసిపోతేనే ఉతకాలి అనుకోవద్దు. దుప్పట్ల లోని డస్ట్ మైట్స్ ఎన్నో ఎలర్జీలు తీసుకొస్తాయి. వేడి వేడి నీళ్ళతో ఉతికి ఎండలో ఆరేయాలి దుప్పట్ల ఉతుకుతాం కానీ దిండ్లు మార్చం. కానీ అవి నెలకోసారయినా ఉతకాలి. గట్టిగా పిండకుండా ఆరేయాలి పరుపులు నేల కోసారి వ్యాక్యూమ్ క్లినర్ తో శుభ్రం చేయాలి దుమ్ముపోతుంది . ఎండలో వేసి షాంపూలో ముంచిన శుభ్రమైన గుడ్డతో మరకలు రుద్దెయ్యాలి అలాగే కార్పెట్స్ కూడా ఆరునెలలకు ఒక్కసారయినా వ్యాక్యూమ్ క్లినర్ తో మొత్తం శుభ్రం చేయకపోతే అనారోగ్యాలు వస్తాయి.