సూర్యోదయానిముందే నిద్రలేవడం మంచిదని తలుసు కానీ లేవడం మాత్రం బద్దకమే. దినచర్య వేళలు తారుమారు అవ్వడంతో ఉదయం నిద్ర లేవడం అనే అలవాటు క్రమంగా పోయింది కానీ అందకరమైనక్రియాశీలమైన జీవితం కావాలనుకొంటే నిద్ర అలవాట్లు మార్చుకోమంటున్నారు ఎక్స్ పర్ట్స్ పని వత్తిడి, వాయుకాలుష్యం, ధ్వని కాలుష్యం తో విపరీతమైన అలసటతో ఉంటారు. ఇందులోంచి బయటపడి మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఉదయాన్నే నిద్ర లేవాలి. రోజంతా ఎలాటి గందరగోళం లేకుండా గడపగలిగే శక్తి నిచ్చేది ఉదయపు ప్రశాంతతే. మందగించిన మెదడు పునరుత్తేజం పొందాలన్నా, రీచార్జ్ అవ్వాలన్నా ఉదయపు గాలి అవసరం. మంచి లక్ష్యాల గురించి అలోచించుకోనేందుకు. వాటిని ఆచరణలో పెట్టే మార్గాలు మనసులో అవిష్కరించుకొనేందుకు ఉదయపు నడక ఎంతగానో ఉపయోగ పడుతుంది. ఉదయాన్నే లేచి ప్రశాంతంగా నడుస్తూ ఇవన్నీ ఆలోచించుకోవచ్చు.
Categories