ఇప్పుడు షాపింగ్ మాల్స్ హోటల్స్ హాస్టల్స్ లో కూడా రహస్య కెమెరాలు ఉంటున్నాయి. దుస్తులు కొనుగోలు చేసి ట్రయల్ రూంకు వెళితే అక్కడ కూడా కెమెరాలు ఉన్నాయేమోనని భయం వేస్తుంది. గోడకు చిన్న బటన్ వంటివి ఉండి దాన్ని వైర్లతో అనుసంధానం చేసి ఉంటే అది కెమెరా కావచ్చు.గదిలోకి వెళితే చిన్న పాటి మిషన్ పని చేసే శబ్ధం వస్తుందేమో చూసుకొవచ్చు. AC ఆన్ చేసి చూస్తే శబ్ధం వినిపిస్తుంది. గోడకు అద్దం ఉంటే దానిపైన వేలు పెట్టి చేస్తే అది 90 డిగ్రీల కోణంలో అద్దంలో కనిపిస్తుంది. ప్రతి బింబం కాస్త దూరంగా కనిపిస్తే అది కెమెరా అయి ఉండవచ్చు. సెట్ ఫోన్స్ కొన్ని ఎలక్ట్రోమాగ్నటెక్ సంకేతాలు గ్రహస్తాయి. ఫోన్ వాడుతుంటే ఏదయిన శబ్దం వస్తే అది కెమెరా అయినట్లే.

Leave a comment