న్యూ పడ్ స్కిల్స్ అంటే ముబైల్ ఫోన్స్ వినియోగించుకోవడం ఒంటరిగా ప్రయాణం చేయడం, అవసరమైతే ఒక పురుషున్ని సాయం కోరడం,పోలిస్ స్టేషన్ కి వెల్లి ఫిర్యాదు చేయడం, కంప్యూటర్ పైన ఇంగ్లీష్ లో ఒక డాక్యుమెంట్ తయారు చేయగలగడం ఇవన్ని ఈ తరానికి అవసరమైన స్కిల్స్ అని వీటిని ఉపయోగించుకోవడంలో తెలంగాణ,ఆంద్రాలో అమ్మాయిల శాతం తక్కువే అని ఒక దేశ వ్యాప్త సర్వే చెబుతుంది.టీనేజ్ బాలికల ఆశలు,ఆకాంక్షలు నైపుణ్యాల వంటి అంశాల పై నన్హికలి ప్రాజెక్టులో భాగంగా నాంధి ఫౌండేషన్ జరిపిన ఈ సర్వేలో కేరళ అన్ని విధాలుగా ముందుంది. మిజోరం,సిక్కిం,మణిపూర్,హిమాచల్ ప్రదేశ్ లు తర్వాతి స్థానంలో ఉన్నాయి.
న్యూపడ్ స్కిల్స్ డెవలప్ మెంట్ చేసుకున్న అమ్మాయిల శాతం 70.4 కేరళలో మాత్రమే నమోదైంది. ఇక తెలంగాణ వైపు చూస్తే 22.5, ఆంధ్రాలో 29 శాతం ఉన్నారు. ఇన్ని మెరుగైన అవకాశాలు ఉన్న అమ్మాయిలు స్కిల్స్ డెవలప్ మెంట్ చేసుకోవడంలో వెనకబడే ఉండటం బాధకరం.
Categories