యాభై ఏళ్లు దాటుతున్నాక విటమిన్ సి శరీరంలో పుష్కలంగా ఉండేలా చూసుకుంటే వృద్ధాప్యం వల్ల ఎదురయ్యే సమస్యలు రావు అంటున్నారు పరిశోధకులు ముఖ్యంగా వెన్నెముక కండరాల పరిమాణం ఏటా ఒక శాతం తగ్గిపోతుంది.దానితో వెన్నుముక ఒంగుతూ ఉంటుంది. యాభై దాటిన వాళ్ళు సి విటమిన్ ఎక్కువగా ఉండే పండ్లు కూరగాయలు బెర్రీలు తినాలి అంటున్నారు.హానికర ఫ్రీ రాడికల్స్  కారణంగా దెబ్బతిన్న కణజాలాలు దెబ్బతినకుండా ఉంటాయి. పండ్లు కూరగాయలు తినే వాళ్ళలో ఎముక కండరాల క్షీణత తక్కువ గా ఉంటుందని విటమిన్-సి శరీరంలో ఉండే లా చూసుకో మంటున్నాయి అధ్యయనాలు.

Leave a comment