Categories
ఎన్నో రకాల అనారోగ్యాలకు నోటి లోని బాక్టీరియా కారణం అంటున్నారు డాక్టర్స్. అందుకే రెండు సార్లు తప్పని సరిగా బ్రష్ చేయాలని చెప్పుతున్నారు. ఆహారం తీసుకున్న ప్రతి సారీ నోటిని నీళ్ళతో కడుక్కోవాలంటున్నారు. ఉదయం, రాత్రి పడుకునే ముందర తప్పని సరిగా బ్రష్ చేయాలి. ఉప్పు, తేనె, పసుపు, పాలు , నిమ్మరసం కలిపి పేస్టు చేసుకుని దాని తో పళ్ళు తోముకుంటే పళ్ళ పై పేరుకున్న పసుపు రంగు పోతుంది. పూర్వపు పద్దతిలో వేప కొమ్మ తో పళ్ళు తోముకోవడం కుడా మంచిదే. వేప బాక్టీరీయా, ఫంగస్ నివారిణి.