కొచ్చి లో అవర్ లేడీస్ గర్ల్స్ స్కూల్ ప్రిన్సిపాల్ గా పని చేస్తున్న 53 సంవత్సరాల నన్ సిస్టర్ లీజీ చక్కాల కల్ నిస్సందేహంగా సాటి లేని మనిషి. ఆమె ఇల్లు లేని పేద విద్యార్థులకు ఇల్లు కట్టించి ఇస్తుంది. 2014 నుంచి గత ఏడేళ్లలో ఆమె నూట 150 ఇళ్ళు తన స్టూడెంట్ ల కోసం నిర్మించింది ఆమె పనిచేస్తున్న స్కూల్లో ఎంతో మందికి ఇళ్లు లేవు. పాలితిన్ షీట్స్ ల  కప్పుతో గుడిసెలలో ఉండే స్టూడెంట్ ల కోసం ఆమె దాతల సాయంతో ఒక సెంట్ లేదా రెండు సెంట్ల స్థలంలో ఐదు నుంచి పది లక్షలు ఖర్చు చేసి ఇళ్లు కట్టించి ఇస్తోంది.తాజాగా రంజాన్ వర్గీస్ అనే ధాత 70 సెంట్ల స్థలం ఇస్తే సిస్టర్ లిజీ ఆ స్థలంలో 12 ఇల్లు కట్టించి తన పేద విద్యార్థులకు ఇచ్చింది. లిజీ తీసుకొన్న ఈ హౌస్ ఛాలెంజ్ కు ఎన్నెన్నో ప్రశంసలు కురుస్తున్నాయి.

Leave a comment