Categories
ఎలాంటి వేడుకలో అయినా ఆడంబరంగా కనిపించాలి అంటే లెహాంగానే సరైన ఎంపిక. ఈ కాలంలో తేలికగా ఉండేలా షఫాన్ జార్జెంట్ ఆర్గాంజా వంటి వస్త్రశ్రేణి ఎంచుకొని వీటిని లేయర్లుగా కుట్టించుకొని అసౌకర్యం లేకుండా ఉంటాయి అంటున్నారు ఎక్సపర్ట్స్. దుపట్టాని లెహాంగాతో కలిపి కుట్టిస్తే ఇంకా కంఫర్ట్ గా ఉంటుంది. చక్కని ప్రింటున్న వస్త్రాలు ఎంచుకొని సాదాబ్లౌజ్ వేసుకొంటే ఎంత బావుంటుంది. అలాగే లేయర్లు ఒకే పోడవుగా కాకుండా కొన్నీ పోడుగ్గా కొన్ని పొట్టిగా తేలికగా ఉండే మత్ వస్త్రంతో కుట్టించుకుంటే అప్పుడు లెహాంగా బరువు అనిపించదు. చూసేందుకు బావుంటుంది అంటున్నారు ఫ్యాషన్ డిజైనర్స్.