Categories
ప్రకృతి మన కెప్పుడు అపురూపమైన వస్తువులనే ఇస్తుంది. కొన్నింటి ఉపయోగం మన దృష్టికి వచ్చేవరకు దాని విలువ తెలుసుకోలేక పోతాం. మసాజ్ ఆయిల్ గా ప్రసిద్ధి కెక్కిన ఆలివ్ ఆయిల్ ఆరోగ్య పరంగా ఎంతో విలువైంది. ఎన్నో ఔషద విలువలున్న ఆలివ్ ఆయిల్ ని వంటల్లో ఉపయోగించడం వల్ల షుగర్ కంట్రోల్ లో ఉంటుందని అద్యాయినాలు చెప్పుతున్నాయి. ఆరోగ్యం, రుచి ని ఇచ్చే ఈ ఆలివ్ ఆయిల్ తో గుండె జబ్బులు, రక్త పోటు సమస్య నుంచి తపించుకోవచ్చని చెప్పుతున్నారు. ఈ నూనెలో వుండే బలేరోపిన్ సమ్మేళనం శరీరంలో ఎక్కువ ఇన్సులిన్ విడుదల అయ్యేలా చేస్తుందని అద్యాయినాలు చెప్పుతున్నాయి. ఆలివ్ ఆయిల్ వినియోగం పెడితే ఆరోగ్య సమస్యలు కొంత వరకు రాకుండా ఉంటాయని అద్యాయినకారులు చెప్పుతున్నారు.