ఎప్పుడూ ఆడవాళ్ళలో ఒక ఆందోళన ….. ఎవరేమనుకుంటారో ? అర్ధం చేసుకుంటారో లేదో ……… ఎలా నచ్చ జెప్పాలో ఏమో ? ఇవే ప్రశ్నలు. సమాధానం లేనివి. ఇలాంటి ఆందోళనలు ఉంటె ఒంటరిగా ప్రయాణాలు చేయండి. కొద్దీ రోజులే. పర్యటనలు మనకు ఆలోచించే సమయం ఇవ్వవు . రైలో ,బస్సో ,విమానమో, దాని టైం ప్రకారం మనం పట్టుకోవాలి. కొత్త చోట మన గురించి మనం బాధ్యత తీసుకోవాలి. అలాంటప్పుడే ధైర్యం వస్తుంది. మనం కొత్త ప్రదేశంలో ఎవ్వరికీ ఏ ప్రశ్నకు జవాబు ఇవ్వక్కరలేదు. భయపడక్కర్లేదు. ఇలాగే ఒకటి రెండు ఒంటరి ప్రయాణాలు చేయండి. అసలు మనసులో వచ్చే అనేకానేక ఆందోళనలకు, సమస్యలకు, భయాలకు జవాబులు దొరుకుతాయి అంటునాన్రు నిపుణులు. ఒక కొత్త చోటు ,కొత్త మనుషులు, కొత్త నిర్మాణాలు ప్రపంచంలో అందమైన ప్రదేశాలు ,ఇష్టమైతే గుళ్ళు ,గోపురాలు ఏవైనా సరే వివిధ జీవనశైలులు భాషలు ఆ సమయంలో ఎదురయ్యే చిన్న ఇబ్బందులు మనల్ని దృఢంగా చేస్తాయి నిజం. ఆందోళనలు మాయం కావాలంటే స్థిరంగా ఆలోచించే ధైర్యం కావాలంటే ఒంటరి ప్రయాణాలు చేయండి.
Categories