Categories
ఎన్నెళ్లయినా వాడుకున్నా బోర్ కొట్టాల్సిందే కానీ జీన్స్ పూర్తిగా పాడైపోవటం ఉండదు.ఒక్క అమెరికా లోనే కోటీ 31 లక్షల టన్నుల టెక్స్ టైల్స్ వృధాగా అయిపోతున్నాయట. ఎన్నో జతల జీన్స్ ఏమై పోవాలి. వాటిని ఏం చేయాలి .ఇదిగో లీవైస్ కంపెనీ ఈ జీన్స్ రీసైక్లింగ్ పద్దతి కనిపెట్టింది. క్లాత్ వృధా అవ్వకుండా కుషన్ కవర్లు, బ్యాగ్ లు ,చెప్పులు,బీన్ బ్యాగ్లు ,ఫోటో ప్రేములు బుక్ స్టాండ్ లు వంటి ఇంటికి పనొకోచ్చె ఎన్నో రకాల వస్తువులు తయారు చేస్తున్నారు. పూల మొక్కలు పెంచటం ఇష్టపడేవాళ్ళు ఏకాంగా జీన్స్ బ్యాగ్స్ కుట్టి అందులో మట్టిపోసి చక్కగా మొక్కలు పెంచేస్తున్నారు.