రోజుకి 5 గ్రాముల ఉప్పుకు మించి తీసుకోవడం ఆరోగ్యరీత్యా ప్రమాదమని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలు చెబుతున్నాయి. అయితే తాజాగా చేపట్టిన సర్వేలో దానికి రెట్టింపుగా ఒక్కొక్కరు 10 గ్రాములు తీసుకొంటున్నారని తేలింది. ఇలా ఉప్పు పైన నియంత్రణ లేకపోతే ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. భారతీయ వంటకాల్లో ఎన్నో దినుసులు, పులుపులు, కారాలు ఎక్కువే. వండే కూరల్లో, పులుసుల్లో టమాటాలు, చింతపండు, ఉల్లిపాయలు వీటికి తోడుగా ఉప్పు వాడటం తప్పదు. నిపుణులు ఏం చెబుతున్నారంటే ఆహారం వండే సమయంలో ఉప్పు వేయకండి. సహజంగా అన్నీ ఉడికాక రుచి చూసుకొని కావలసినంత ఉప్పు జోడించమంటున్నారు. సహజంగా కూరగాయల్లో వుండే ఉప్పు సరిపోతుందంటారు. ఉడికించకుండా, ఆవిరిపైన ఉడకబెట్టి గ్రిల్లింగ్, మైక్రోవేవ్ చేయటం బెస్ట్ అంటారు. రోజుకి ఐదు గ్రాములకు మించి ఉప్పు వాడద్దని WHO హెచ్చరిస్తుంది.
Categories