Categories
తెల్ల బడిపోయిన జుట్టును నల్లగా చేయటం అసాధ్యం కానీ కొత్తవి తెల్లబడకుండా చర్యలు తీసుకోవచ్చు ఇందుకు ఉసిరి చక్కగా పనికి వస్తుంది. ప్రతి రోజు ఒక ఉసిరికాయ తినాలి హెన్నా పొడిలో ఉసిరి పోక కలిపి తలకు అప్లై చేయాలి గుప్పేడు ఎండు ఉసిరిని మూడు కప్పుల నీళ్ళలో నానబెట్టి మరునాటి ఉదయం మొత్తాన్ని గ్రైండ్ చేయాలి. ఈ గుజ్జులో హెన్నపొడి కలిపి కొద్దిగా నిమ్మరసం గుడ్డు సొన,తేనె కలిపి ఈ మిశ్రమాన్ని నాననిచ్చి తలకు అప్లై చేయాలి. గంట సేపు ఉంచుకొని కడిగేసుకోవచ్చు. జుట్టు బాగా ఆరిపోయాక కాస్త కొబ్బరి నూనె రాసి రాత్రంతా ఆలా వుంచుకోని ఉదయానే తలస్నానం చేయచ్చు.