Categories
పిల్లల్ని ఉయ్యాలల్లో వేయటం అంటే ఉయ్యాలను పువ్వులతో అలంకరించటం. చక్కని ఉయ్యాల్లో ఒక పట్టుచీరె పరిచి పాపాయిని పడుకోబెట్టే వాళ్ళు. పెద్దవాళ్ళు అక్షింతలు వేసి ఆశీర్వాదించే వాళ్ళు. కానీ ఇప్పుడీ ఉయ్యాల ఫంక్షన్ లో అందమైన ఉయ్యాలను అలంకరించటం చాలా ముఖ్యమైపోయింది. రకారకాల డిజైన్ లతో ఉయ్యాలను ధీటుగా స్టేజ్ ను అలంకరిస్తున్నారు. కళా కారులు,రకరకాల థీమ్ లు వచ్చాయి. ఉయ్యాల కలువ పువ్వులా ,చంద్రవంకలా,నెమలిలా బంతి చామంతి ,లిల్లీలలో రకరకాల పుష్పాలతో అలంకరణతో పాపాయి ఉయ్యాల ముస్తాబవుతోంది. ఉయ్యాల ఉంచే స్టేజీ కూడా సినిమా సెట్టింగ్ ను తలపించేలా తయారు చేస్తున్నారు.