Categories
కొందరు విశాలంగా ఆలొచిస్తారు మరి కొందరు స్వార్దంగా అనిపిస్తారు. కొందరు భోళాగా మరికొందరు సృజనాత్మకంగా ఇలా భిన్నమైన మనస్థత్వాలతో ఉండటానికి వాళ్ళ మెదడు ఆకారమే కారణం అంటున్నారు పరిశోధకులు. మెదడులో వల్కలంగా కనిపించే భాగం మందంగా ముడతలు పడి తక్కువ విస్తీర్ణంలో వ్యాపించి ఉంటే వాళ్ళలో మానసిక పరమైన సమస్యలు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అదే వల్కలం ముడతలు లేకుండా పలచగా ఉంటే భావోద్వేగాలు సమతుకంలో ఉండి సత్ర్ఫవర్తన కలిగి ఉంటారని అంటున్నారు. బుద్ధి మాంద్యం అల్జీమర్స్ డిప్రెషన్ వంటి వ్యాధుల గురించి నిశితంగా పరిశోధక చేసేందుకు 500 మందిని ఎంపిక జేసి మెదడు ఆకారాన్ని క్షుణంగా పరిశీలించి ఈ విషయం తెలుసుకున్నారు.