Categories
xigna bowgnam ఈ నోరు తిరగని పేరు చైనాలో ఓ పుచ్చకాయ మ్యూజియం ఉంది. పుచ్చకాయల సాగులో చైనా నే ముందుంటుంది. ఆ ఇష్టం తో ఈ వాటర్ మెలాన్ మ్యూజియం కట్టేసింది రెండు ఆకుల మధ్య పచ్చిగా మెరిసిపోయే పుచ్చకాయ ఆకారంలో 2002 లో ఈ మ్యూజియం నిర్మించారు. ఇందులో రకరకాల పుచ్చకాయలు రకరకాల సైజుల్లో నోరూరిస్తూ కనిపిస్తాయి. ఇవన్నీ మైనం తో తయారు చేసినవి. మ్యూజియం చుట్టు ఉన్న ఉద్యాన వనంలో అచ్చంగా ఇలాటి పుచ్చకాయలు కొనుక్కొని తినచ్చు. 4 వేల చదరపు మీటర్ల వైశాల్యంలో కట్టిన ఈ మ్యూజియం బీజింగ్ కు రక్షణా గా ఉన్న పాంగే జువాంగ్ గ్రామంలో ఉంది.