Categories
ఎడారి పల్లెల్లో అమల రూయా ని వాటర్ మదర్ అంటారు .బిందెడు నీళ్ళ కోసం పది పన్నెండు కిలోమీటర్లు నడిచి వెళ్ళే ఆడవాళ్ళ కష్టం చూసి చలించి పోయింది అమల రూయాని .పెద్దవాళ్ళు నీళ్ళకోసం గంటల తరబరి బయటకి పోతే పిల్లలు సరైన ఆహారం లేక చదువు సంధ్య లేక వీధుల్లో తిరుగుతూ ఉంటారు .ఆ పరిస్థితిలో అకార్ చారిటబుల్ ట్రస్ట్ ని రిజిస్టర్ చేసి గ్రామస్థుల భాగస్వామ్యంతో అమల 350 చెక్ డామ్ లు కట్టించింది .వాటివల్ల 450 పల్లెల్లో భూగర్భ జలాలు పెరిగాయి .ఊర్లు పాడి పంటలతో కళ కళ
లాడుతున్నాయి .స్త్రీల కష్టం తీరింది పిల్లలు బడికెళ్ళి చదువు కొంటున్నారు .నాకు 70 ఏళ్ళు 90 ఏళ్ళు వచ్చే వరకు చెక్ డ్యామ్ లు కట్టిస్తూనే ఉంటాను అంటుంది అమల .