విశాఖ మన్యంలో కనువిందు చేసే అందాలు జలపాతాలు ఉన్నాయి. పచ్చని కొండల మధ్య నుంచి కిందికి దూకే జలపాతాల అందం చూసేందుకు రెండు కళ్లు చాలవు. మన్యం లో కొండల మధ్య ప్రకృతి ప్రియులు ఈ జలహారాలను చూసేందుకు వరుస కడతారు. ఇదే ఆ అపురూపమైన ప్రదేశాలు చూసేందుకు అనువైన సమయం. విశాఖపట్నం నుంచి పాడేరు మీదుగా మాడుగుల వచ్చి అక్కడి నుంచి కొత్తపల్లి ప్రధాన రహదారి ఆనుకొని ఓ అందమైన జలపాతం ఉంటుంది. ఈ కొత్తపల్లి జలపాతం కి నడిచే అవసరం ఉండదు పాడేరు నుంచి వనుగు పల్లి పంచాయతీ లోని చిదిమిశాలకు సమీపంలో జాంకారమ్మ జలపాతం ఉంది. బొర్రా గుహలు సమీపంలో కటిక జలపాతం అనంతగిరి సమీపంలో తాడిగుడ జలపాతం పాల ధరలు జాలువారుతున్నట్లు ఉంటాయి. అరకులోయలోని చాపరాయి జలపాతం సినిమా షూటింగ్ లకు ప్రసిద్ధి. ప్రకృతి అందాలకు నిలయమైన డుడుమ జలపాతం పాడేరు నుంచి ముంచంగి పుట్టు మీదుగా ఉన్న ఒనకడిల్లీ దగ్గర ఉంది. హకుంపేట లో తీగల వలస రణ జల్లెడ సీలేరు దగ్గరలో ఐసు గడ్డ, పొట్లూరు జలపాతాలున్నాయి. లంబసింగి లోని రావిమాను పాకాల జలపాతం అటవీ అందాలకు నిలయం చల్లని లంబసింగి ని ఏటా వేల మంది పర్యాటకులు దర్శిస్తుంటారు. దారాలమ్మ గాదిగుమ్మి మూలకలపాడు జలపాతాల సందర్శన కోసం తప్పనిసరిగా విశాఖ ను చూడాల్సిందే.
Categories